| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం

సుజాతనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంకాంగ్రెస్ పార్టీ  ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు పేరుతో మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని సుజాతనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ విమర్శించారు రెండు సంవత్సరాల క్రితం అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆరు పథకాల పేరిట లక్షలాది దరఖాస్తులు స్వీకరించిందన్నారు.

ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ఇచ్చిన హామీలను మరిపించేందుకు ఇప్పుడు ప్రగతి ప్రణాళిక పేరుతో మరో నాటకానికి తెరతీసిందన్నారు

ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు  నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ పిలుపునిచ్చారు

Previous మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
Next సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?
ADVERTISEMENT