| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?

పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రహైదరాబాద్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ హల్ చల్ చేసింది. పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వలంటూ రూంలోకి వచ్చిన యాప్రాన్ వెసుకున్న ఓ మహిళ

వారి కుటుంబీకులందరిని బయటకు పంపి,పేషేంట్ కు స్పృహ లేకుండా చెసి పది తులాల బంగారం తో ఉడాయించింది. దీంతో విషయం గమనించిన పేషేంట్ బంధువులు ఆసుపత్రి యజమన్యనికి ఫిర్యాదు చెయగావచ్చిందేవరో తమకు తెలియదని చెప్పారు యాజమాన్యం.హాస్పిటల్ యాజమాన్యం సమాధానంతో షాక్ కి గురైన పేషెంట్ బంధువులు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చెశారు. ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన సుధరాణి అనే మహిళ అనార్యోగంతొ ఆసుపత్రిలో చెరింది.డిశ్చార్జ్  సమయంలో సుధరాణి ఉన్న గదిలోకి ఓ మహిళ యాప్రాన్ వెసుకోని వచ్చింది. పేషేంట్ బంధువులను బయటకు వెళ్ళమంటూ సూచించడంతో వారంత బయటకు వెళ్లారు

యాప్రాన్ వెసుకోని వచ్చిన మహిళ బయటకు వెళ్ళిన కోద్ది సమయనికి లోపలికి వెళ్ళి చెడగాసుధరాణి స్పృహ కోల్పోయి ఉంది. వెంటనే యశోద ఆసుపత్రి యజమాన్యంకు ఈ విషయం తెలియజేశారు బంధువులు.

పేషెంట్ రూంలోకి వచింది ఎవరో తమకు తెలియదంటూ సమాధానం ఇవ్వడంతో చేసేదేమిలేక వెంటనే మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చెశారు.

అయితే యాప్రాన్ లో వచ్చిన మహిళ,నర్సింగ్ స్టాఫ్ రూంలోకి వెళ్ళి రావడం,అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉండడంతో తెలిసిన వారి పనా,లేక మరేవరైన వచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చెస్తున్నారు. పది తులాల బంగారం పోయిందంటూ ఫిర్యాదులో  బంధువులు పెర్కోన్నారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Next లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ADVERTISEMENT