Posted on 2026-03-11 18:26:29
సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి
ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత
నూతన కానిస్టేబుళ్లను అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దాలి
విధుల్లో చురుకుతనం, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి
సెక్షన్ ఇన్చార్జిల శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ దిశానిర్దేశం
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు నిర్వహించిన సెక్షన్ ఇన్చార్జిల ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరును మెరుగుపరచడం మరియు పర్యవేక్షణను బలోపేతం చేయడంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన సెక్షన్ ఇన్చార్జిలతో ఎస్పీ గారు ముఖాముఖిగా మాట్లాడి, స్టేషన్లలో పిటిషన్ మేనేజ్‌మెంట్ సకాలంలో జరుగుతుందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎటువంటి పక్షపాతం లేకుండా పని విభజన జరగాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సెక్షన్ ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడికి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిలో ఏకరూప నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. చట్టంపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే బాధితులకు సమయానికి న్యాయం అందడం అత్యంత ముఖ్యమని ఎస్పీ గారు నొక్కి చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని, తక్షణ పరిష్కారం అందించేలా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విచారణ ప్రక్రియలో పారదర్శకత పాటించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు.
ముఖ్యంగా సీనియర్ సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు సరైన మార్గదర్శకత్వం అందించి వారిని ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతిరోజు విధులకు హాజరయ్యే ముందు ఆ రోజు చేయాల్సిన పనులను సరైన ప్రణాళికతో సిద్ధం చేసుకుంటే పని ఒత్తిడి తగ్గి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, పీసీఆర్ సీఐ నరేష్, జిల్లాలోని వివిధ సెక్షన్ ఇన్చార్జిలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >