Posted on 2026-02-24 10:41:29
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం బాటిల్ ప్రత్యక్షం
కొబ్బరి బోండాలకు అనుమతులు లేవు కానీ కోటర్ సీసాలకు ?
నిబంధనలు కేవలం బోర్డులకేనా?
ప్రమాదకరంగా మారిన బయో మెడికల్ వేస్ట్
ఆసుపత్రిలో పలుచోట్ల దర్శనమిస్తున్న ఇంజక్షన్లు మెడికల్ వేస్టేజ్
డైలీ భారత్, షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రాణదానం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి, అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగాలకు నిలయంగా మారుతోంది. షాద్‌నగర్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో పారిశుధ్యం పడకేసింది. నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న అధికారులు, ఆసుపత్రి లోపల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను మాత్రం గాలికొదిలేశారు.
నిబంధనలు కేవలం బోర్డులకేనా?
ఆసుపత్రి లోపలికి కొబ్బరిబోండాలను తీసుకురాకూడదని పెద్ద పెద్ద బోర్డులు పెట్టిన యాజమాన్యం, అదే ఆసుపత్రి రెండో అంతస్తులో దర్శనమిస్తున్న మద్యం సీసాలను ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోగులు కోలుకోవడానికి తాగే కొబ్బరినీళ్లపై ఉన్న నియమం, మందు బాటిళ్లపై లేదా? అని పౌరులు మండిపడుతున్నారు.
ప్రమాదకరంగా మారిన బయో మెడికల్ వేస్ట్
ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వాడిన ఇంజక్షన్ సూదులు, సిరంజీలు, మెడికల్ క్రీములు కుప్పలుగా పడి ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని సురక్షితంగా ధ్వంసం చేయాలి, కానీ ఇక్కడ మాత్రం బహిరంగంగా పడేయడం వల్ల చిన్నారులకు, రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంది. స్వచ్ఛ భారత్ నినాదం ఈ ఆసుపత్రి గడప కూడా దాటలేదని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
బాధ్యులపై వేటు పడాల్సిందే!
ఆసుపత్రిలో మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? పారిశుధ్యం నిర్వహించాల్సిన వారు నిద్రిస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలివరణలో ఎక్కడ చూసినా వాడిన ఇంజక్షన్ సూదులు, సిరంజీలు, మెడికల్ క్రీములు కుప్పలుగా పడి ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని సురక్షితంగా ధ్వంసం చేయాలి, కానీ ఇక్కడ మాత్రం బహిరంగంగా పడేయడం వల్ల చిన్నారులకు, రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంది. స్వచ్ఛ భారత్ నినాదం ఈ ఆసుపత్రి గడప కూడా దాటలేదని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
బాధ్యులపై వేటు పడాల్సిందే!
ఆసుపత్రిలో మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? సెక్యూరిటీ సిబ్బంది ఏం ? పారిశుధ్యం నిర్వహించాల్సిన వారు నిద్రిస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >