| Daily భారత్
Logo




బెల్టుషాపులను అరికట్టాలి, ప్రజారోగ్యాలను కాపాడాలి

News

Posted on 2026-02-18 12:29:17

Share: Share


బెల్టుషాపులను అరికట్టాలి, ప్రజారోగ్యాలను కాపాడాలి

ప్రతి వైన్ దుకాణాలలో అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలి

స్థానికులు వ్యతిరేకరించిన  చోట బెల్ట్ షాపులు పెట్టొద్దు

సిండికేట్ దోపిడీని అరికట్టి, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయాలు జరపాలి

ఎక్సైజ్ సూపరిండెంట్ కు  వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నె బాబురావు

డైలీ భారత్, అశ్వాపురం: మండలంలో  విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్టుషాపులు అరికట్టాలని, సిండికేట్ దోపిడీని నివారించాలని, ఎమ్మార్పీ ధరలకే మధ్య విక్రయాలను జరపాలని, సామాజిక సేవకులు కర్నె బాబురావు అన్నారు. ఈ మేరకు ఆయన  బుధవారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనరీ  సూపరిండెంట్ జానయ్యకు  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, అశ్వాపురం మండల కేంద్రంలో వైన్ షాప్ నిర్వాహ కులు ప్రత్యక్షంగా  బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈ షాపులు జనావాసాల మధ్య స్కూళ్లు దేవాలయాలకు దగ్గర్లో జన సమర్థం ఉన్న ప్రాంతాల్లో పెడుతున్నారని తెలిపారు. పలు ప్రాంతాల్లో మహిళలు, స్థానిక ప్రజలు వీటిని ప్రతిఘటిస్తున్నారన్నారు. కొత్తగా షాపులు పొందిన వైన్ షాప్ నిర్వాహకులు   అడ్డగోలు లాభార్జన కోసం ఇప్పటికే ఇబ్బడి ముబ్బ డిగా అనధికారికంగా  బెల్టుషా పులతో ఒప్పందాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బెల్టుషాపుల వల్ల మద్యం వినియోగం పెరగడమే కాకుండా నియం త్రణలేని మద్యం అమ్మకాలు సాగుతాయ ని తెలిపారు. జనం అప్పుల పాలవుతున్నారని, మహిళలు వేధింపులకు గురవుతారని, అల్లరి మూకలు పెట్రేగిపోతాయని, అందువల్ల బెల్టుషాపులను ఎక్కడి కక్కడ కట్టడి చేయాలన్నారు. మండల కేంద్రంలోని వైన్ షాపుల రూటే సపరేటు అన్న చందంగా తయారైందనీ, సమయ పాలన పాటించకుండా షాపులను నిర్వహిస్తున్నారని, నౌకరినామ నిబంధనలు కూడా పాటించడం లేదన్నారు. మూడు వైన్ షాపుల నిర్వాహకులు సిండికేట్ గా మారి. మండలంలో ఉన్న గ్రామాలను షాపునకు ఏడు గ్రామాల చొప్పున లక్కీ డ్రా రూపంలో పంచుకోవడం మండల చర్చనీయాంశంగా మారిందన్నారు. ప్రతి షాప్ లో అన్ని రకాల బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి వైన్ షాపులో ఆన్లైన్ పేమెంట్ సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. బెల్ట్ షాపులను నియంత్రించాలని అందుకోసం  ప్రజల ఫిర్యాదులకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వాటిపై కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు వివరించారు. తాను చేసిన విజ్ఞప్తి పట్ల ఎక్సైజ్ అధికారు లు సానుకూలంగా స్పందించారని త్వరలోనే  చర్యలు చేపడతామని హామీ ఇచ్చి నట్లు ఆయన మీడియాకు తెలిపారు.

Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >