| Daily భారత్
Logo




ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య

News

Posted on 2026-02-18 11:54:20

Share: Share


ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య

డైలీ భారత్, వనస్థలిపురం: పట్టపగలే వనస్థలిపురంలో దారుణం..ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య.విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతో వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీతను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు..

వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. గ్రీన్ సిటీ కాలనీ లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీత ను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హతమార్చాడు చేశాడు. విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మహేష్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సునీత, మహేష్‌ల మధ్య 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల క్రితం సునీత అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసి మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తోంది.

సునీత  రెండో పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన మహేష్, ఆమెపై విపరీతంగా పగ పెంచుకున్నాడు. ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం రెండు పదునైన కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత నివాసంలోకి చొరబడ్డాడు. అడ్డువచ్చిన వారిని పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించిన మహేష్, సునీతపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయగా ఆమె కుప్పకూలిన తర్వాత కూడా వదలకుండా, అక్కడే ఉన్న పూలకుండీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో సునీత విలవిలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు.నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పట్టపగలే కాలనీలో హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >