| Daily భారత్
Logo




48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పిట్లం పోలీసులు

News

Posted on 2026-02-08 17:00:21

Share: Share


48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పిట్లం పోలీసులు

నిందితుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు.

సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరస్థుడి గుర్తింపు .

చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు.

బాన్సువాడ డిఎస్పి విఠల్ రెడ్డి వెల్లడి

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: తేదీ 06.02.2026 నాడు ఫిర్యాదుదారుడైన కోట సిద్ధులు S/o సంగయ్య, నివాసి పిట్లం గ్రామం, సాయంత్రం సమయంలో జాతీయ రహదారి-161 పక్కన తాను కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వెళ్లగా అక్కడ రాజేష్, నివాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్యకు గురి అయి రక్తపు మడుగులో పడి ఉండగా వెంటనే పోలీస్ స్టేషన్ పిట్లం నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.

జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  ఆదేశాల మేరకు బాన్సువాడ SDPO  విఠల్ రెడ్డి  నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక బృందం బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య ఆధ్వర్యంలో, మరొకటి పిట్లం ఎస్ఐఐ వెంకట్ రావు ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలు మరియు సికెమెరాల .సి. సహాయంతో నిరంతర దర్యాప్తు చేపట్టగా, తేదీ 08.02.2026 నాడు పిట్లం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో నిందితుడు కిరాయికి ఉన్న ఇంటికి వచ్చి తన సామాన్లు సర్దుకొని పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీస్ బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో నిందితుడు శ్రీకృష్ణ అలియాస్ శ్రీ కృశున్ (45 సంవత్సరాలు), వృత్తి: పెయింటర్, గోరఖపూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మృతుడు రాజేష్ను కూలీ డబ్బుల విషయంలో తలెత్తిన గొడవలో కర్రతో కొట్టి హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు.

మృతుడు రాజేష్ మరియు నిందితుడు శ్రీకృష్ణ గతంలో బెంగళూరులో కలిసి పని చేసేవారు. రాజేష్ మిత్రుడు దిలీప్ పిట్లం గ్రామంలో పెయింటింగ్ పనులు ఉన్నాయని చెప్పడంతో ఇద్దరూ అక్కడికి వచ్చారు. అయితే దిలీప్ కూలీ డబ్బులు చెల్లించకుండా గ్రామం విడిచి వెళ్లడంతో నిందితుడు మృతుడితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో కోట సిద్దులు నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి రాజేష్ను తీసుకెళ్లి కర్రతో కొట్టి హత్య చేసి, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మరియు రూ.250/- నగదు దోచుకొని పరారయ్యాడు.

నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసిన వస్తువులు:

హత్యకు ఉపయోగించిన కర్ర

 Mi కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ (మృతుడి వద్ద నుండి దొంగిలించినది)

రూ.100/- నగదు

రక్తపు మరకలతో ఉన్న దుస్తులు

ఈ కేసులో అతి తక్కువ సమయంలో నేరస్తుడిని పట్టుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన తిరుపయ్య, బాన్సువాడ రూరల్ సీఐ, వెంకట్ రావు, పిట్లం ఎస్ఐ, మరియు కానిస్టేబుల్ కె. రఘు, వెంకటేష్, నవీన్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారని బాన్సువాడ డీఎస్పీ  తెలిపారు.

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >