| Daily భారత్
Logo




మహిళను వేధించిన కేసులో ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా

News

Posted on 2026-02-07 06:46:22

Share: Share


మహిళను వేధించిన కేసులో ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా

డైలీ భారత్, సిరిసిల్ల: మహిళను వేధించిన కేసులో ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 6000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు కే. కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు..

సుభాష్ నగర్ కు చెందిన ఒక మహిళ యొక్క భర్త బతుకుదెరువు నిమిత్తం సౌదీ దేశంలో వెళ్లగా, ఆమెకు ఇద్దరు కూతుర్లు ముగ్గురు కుమారులు సంతానం కాగా తన కులానికి చెందిన ఎండి మజీద్ అను అతను తనపై దురుద్దేశంతో ఇబ్బందులకు గురి చేయొచు తను ఎటు పోయిన  వెంబడించడం రకరకాల ఫోన్ నెంబర్లనుండి ఫోన్ చేసి మాట్లాడడం, వేధింపులకు గురి చేయడం చేయగా తన కుల పెద్ద మనుషుల కు చెప్పగా అందుకు అతన్ని మందలించగా అతడు కొద్ది రోజులు ఊరుకున్నాడు. కొద్ది రోజులు మంచిగానే ఉండి మళ్ళీ పాతవిధాంగానే తనపై దురుద్దేశంతో వెంబడించడం తనతో ఫోన్లో మాట్లాడాలని తన కోరికలు తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నాడని, తేది. 22. 2.2021 నాడు బీడీల కంపెనీకి వెళ్ళుచుండగా సుభాష్ నగర్ సిరిసిల్లలోని యెల్ల లక్ష్మీనారాయణ ఇంటి ఎదురుగా మజీద్ వెంబడించి తన చెయ్యి పట్టుకుని లాగి తనతో ఫోన్ మాట్లాడాలని అతను చెప్పినట్లు విని అతని కోరికలు తీర్చాలని లేకపోతే చంపుతానని బెదిరించినాడని తన యొక్క పరువు తీసినాడు అని సుభాష్ నగర్ కు చెందిన ఒక మహిళ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై జి.సుధాకర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడు ఆయన ఎండి.మజీద్ సన్నాఫ్ యూసఫ్ అను అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అనంతరం ఎస్ఐ  కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తర్వాత సీఎంఎస్ ఎస్ఐ.శ్రావణ్  ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ఏడు (7)మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల సందీప్ వాదించగా కేసు పూర్వకరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ ప్రవీణ్  నేరస్తుడు అయిన ఎండి.మజీద్ కు రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 6000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కే కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >