Posted on 2026-02-06 14:35:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ పథకాలు అన్ని ప్రతి ఒక్క లబ్దిదారులకు అందజేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ మున్సిపాలిటీలోని 12 వార్డు అభ్యర్ధి కలంకర్ దిలీప్, 13 వార్డు అభ్యర్ధి రిజ్వాన బేగం ముబారక్ అలి,14 అభ్యర్ధి అందే మోహన్ వార్డులలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం మహిళా సంఘాలకు పెట్రోల్ పంప్ లను, ప్రభుత్వ ఆసుపత్రులలో, విద్యాలయాలలో క్యాంటీన్లను మంజూరు చేసి ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం, మహాలక్ష్మి పథకం లో ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు అందుతున్నాయా, ఎలా అమలవుతున్నాయంటూ ప్రజలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మంత్రి ప్రజలను కోరారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >