Posted on 2026-02-06 13:15:02
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేందుకు వద్దిపేట,పూసుగుప్ప గ్రామాల మధ్యలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు.బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు.
దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీఎస్పీ రోహిత్ రాజు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా,సైబర్ నేరాల పట్ల ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై గణేష్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >