Posted on 2026-01-12 19:55:46
డైలీ భారత్, భూపాలపల్లి జిల్లా: ఈరోజు భూపాలపల్లి మండలం గొర్ల వేడు తండా గ్రామంలో భూత్ అధ్యక్షులు నంగావత్ తిరుపతి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా
బిజెపి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు హాజరైనారు వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన స్వామి వివేకానంద జయంతి (జనవరి 12) పురస్కరించుకుని ఆయన చెప్పిన సూక్తి ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్న మాటలను గుర్తు చేసారు.. యువతను జాగృతం చేసిన స్వామి వివేకానంద గారి ఆలోచనలు ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు వారు చూపిన విలువల బాటలో నడుచుకుంటూ దేశ నిర్మాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తూ మరింత బలంగా ముందుకు సాగాలని కోరారు
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నరాల కొమురయ్య గారు బిజెపి సీనియర్ నాయకులు మందల రాంచంద్రారెడ్డి గారు బూత్ అధ్యక్షులు దుండ్ర రాజు మామిడి కుమార్ భూక్య రవి మోత్కూరి నాగరాజు ఆరుగొండ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >