| Daily భారత్
Logo




వైరాలోనే ఆర్టీవో కార్యాలయాన్ని కొనసాగించాలి

News

Posted on 2026-01-09 13:00:13

Share: Share


వైరాలోనే ఆర్టీవో కార్యాలయాన్ని కొనసాగించాలి

ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఎం(ఎం) నిరసన 

 బోనకల్‌కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం హెచ్చరిక.

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి దినేష్ కు వినతి

డైలీ భారత్, వైరా:వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు విశేషంగా సేవలు అందిస్తున్న వైరా ఆర్టీవో కార్యాలయాన్ని వైరా నియోజకవర్గ కేంద్రంలోనే కొనసాగించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వైరా ఆర్టీవో బోనకల్ కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆర్టీవో కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.దినేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా వైరా కేంద్రంగా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా సేవలందిస్తున్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరా నుంచి మధిర నియోజకవర్గం బోనకల్‌కు మార్చాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వైరాలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని సిపిఐ(ఎం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. నిర్ణయం వల్ల వైరా, కొణిజర్ల, తల్లాడ, ఎన్కూరు మండలాల ప్రజలకు రవాణా సేవలు అందనంత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోనకల్ మండల కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆదేశాల మేరకు గురువారం బోనకల్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని వైరా ఎంవిఐ వరప్రసాద్, తహసిల్దార్ రమాదేవి, యుడిసి ఉపేందర్ పరిశీలించారని తెలిపారు. బోనకల్ కు కొత్త ఆర్టీవో కార్యాలయం మంజూరు చేయాలని సూచించారు. వైరాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలని కోరారు. బోనకల్ కు మార్చడం వల్ల వేలాది మంది  ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, నాయకులు గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, మందడపు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి రామారావు,యనమద్ది రామకృష్ణ, అమరనేని  కృష్ణ, పానుగంటి రాంబాబు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి సుజాత, చావా కళావతి తదితరులు పాల్గొన్నారు.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >