జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణ ఘటన
ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడీ ప్రాంతంలోదారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని సాయి అశ్విని టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ అనే యువకుడు (27) సంవత్సరాల యువకుడు బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. గత ఆరు సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు నాందేడ్ ధర్మాబాద్ అని పోలీసులు గుర్తించారు. రోజువారి లాగే విధులకు వచ్చిన ఓంకార్ తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఓంకార్ మృతదేహాన్ని మార్చరికి తరలించారు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ ఆస్పత్రి బాత్రూంలో బలవన్మరణానికి పాల్పడడంతో కలకలం రేపింది. యువకుడి బందువులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనను ఖాళీల్ వాడిలో చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆందోలనను చేసారు. దీంతో వెంటనే పోలీసుల సంఘటన వద్దకు చేరుకొని కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నారు.