పోలీసుల వాహనం రావడాన్ని గుర్తించడంతో అక్కడి నుండి ఉడాయించిన దుండగులు
జిల్లా కేంద్రంలో వరస దొంగతనాలతో పోలీసులకు తలనొప్పిగా మారిన వైనం..
.. షాప్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు బజార్ సమీపంలో గల శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ ను దోచుకునేందుకు దుండగులు విపల యత్నం చేశారు. అర్ధరాత్రి అనంతరం ముఖాలకు ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు సభ్యులు జ్యువెలరీ షాపు వద్దకు వచ్చి ఇనుప రాడ్లతో షట్టర్ ను ధ్వంసం చేసి పైకి లేపే లోనికి దూరెందుకు ప్రయత్నించారు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది అటువైపుగా రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. విషయం తెలియడంతో ఏసీపి రాజా వెంకట్ రెడ్డి, నగర సీఐ శ్రీనివాస్ రాజ్ లు ఘటన స్థలాని కి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దోపిడీకి యాత్నించి పరారైన దుండగుల ఆనవాళ్ళ కోసం పోలీస్ టీమ్ లు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.