| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం

డైలీ భారత్, మట్టపల్లి:డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల & సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, చెన్నూరి విజయ కుమార్, మట్టపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి అప్పారావులు భక్తిపూర్వకంగా  ఆహ్వాన పత్రిక అందజేసి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు హాజరు కావలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ముస్తాబు అవుతుందని ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ధర్మకర్త మండలి సభ్యులు,కార్య నిర్వాహక అధికారి,వేద పండితులు, అర్చకులు, సిబ్బంది కార్యాచరణలు సిద్ధం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవ స్థానం ప్రధాన అర్చకులు తూమాటి శ్రీనివాస చార్యులు,అద్దెపల్లి ఫణి భూషణ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Previous ఘనంగా అఖిల భారత‌ అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు
Next పట్నం అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ మజిత్
ADVERTISEMENT