| Daily భారత్
Logo




డబ్బుకు ఆశపడి రెండు నెలల కన్న కొడుకుని విక్రయానికి పెట్టిన కర్కషపు తల్లి

News

Posted on 2025-12-16 06:52:24

Share: Share


డబ్బుకు ఆశపడి రెండు నెలల కన్న కొడుకుని విక్రయానికి పెట్టిన కర్కషపు తల్లి

భర్త పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో బయటపడ్డ విషయం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవ మాసాలు కడుపులో మోసిన ఆ తల్లి రెండు నెలల బాబును మధ్యవర్తుల ద్వారా ఓ వ్యక్తికి విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన శ్రీనివాస్, లక్ష్మీల దంపతుల రెండు నెలల పసికందు ఈ నెల ఐదున ఇంట్లో కనిపించకపోవడంతో బాలుడి తండ్రి శ్రీనివాస్ 4 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 5న మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ రెండు నెలల బాలుడి తల్లి డబ్బుల కోసం ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పూనే కు చెందిన విశాల్ అనే వ్యక్తికి రెండున్నర లక్షలకు బాలుడిని విక్రయించడానికి ఒప్పుకున్నట్లు పోలీసుల కథనం ద్వారా తెలుస్తుంది. నిజామాబాద్ కు చెందిన రమాదేవి, మంజుల హైదరాబాద్కు చెందిన విట్టల్ ముగ్గురు కలిసి  లు ఈ ముగ్గురు కలిసి తల్లి లక్ష్మి తో సహా హైదరాబాద్ శివారులో పూణే కు చెందిన విశాల్ కు అప్పచెప్పడానికి ఈ నెల 9న వెళ్లి రెండున్నర లక్షలు తీసుకువచ్చినట్లు సమాచారం. పోలీసులకు సోమవారం నిందితులు దొరకగా తల్లి లక్ష్మిని కోర్టులో హాజరు పరిచినట్లు మిగతా నలుగురు పై కూడా కేసు నమోదు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై వివరించారు. అయితే పిల్లలు పుట్టడం లేదని పిల్లలు లేరని ఈరోజుల్లో భార్యాభర్తలు  దూరమవుతున్న నేపథ్యంలో కన్నతల్లి ఇలాంటి ఘటన చేయడం బాధాకరం.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >