| Daily భారత్
Logo




గ్రామ పంచాయతీ ఎన్నికలు : 5 గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం

News

Posted on 2025-12-15 15:35:04

Share: Share


గ్రామ పంచాయతీ ఎన్నికలు : 5 గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం

​కరీంనగర్ కమీషనరేట్ పరిధి‌లోని 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు

డైలీ భారత్ న్యూస్, కరీంనగర్: ​కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17, 2025న బుధవారంనాడు జరగనున్న మూడవదశ గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం, ఐ.పి.ఎస్., భారతీయ నాగరిక్  సురక్ష సంహిత(BNSS) లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్ మరియు వి. సైదాపూర్ ఐదు మండలాల పరిధిలో ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఈ మండలాల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం లేదా సమావేశం కావడం పూర్తిగా నిషేధించబడింది.

ఈ ఉత్తర్వులు 15-12-2025 సోమవారం సాయంత్రం 5:00 గంటల (17:00 hrs) నుండి  తేదీ: 17-12-2025  బుధవారం రాత్రి 11:59 గంటల (23:59 hrs) వరకు అమలులో ఉంటాయి.

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >