Posted on 2025-12-15 14:16:10
ఐ టి సి మరియు ప్రథమ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మేము సైతం ఫౌండేషన్ వారి సహకారంతో దమ్మపేటలోని వాసవి క్లబ్ భవనం నందు ఉదయం 9 గంటలకు
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మరియు అశ్వరావుపేట పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ,యువకుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నాము,18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండి 8,9,10 ఇంటర్,ఐటిఐ,డిగ్రీ,డిప్లమా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు భద్రాచలంలోనే 45 రోజులు పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఈ క్రింది పేర్కొన్నటువంటి ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు కల్పిస్తున్నాము,ఎలక్ట్రిషన్ మరియు సోలార్, బ్యూటీ పార్లర్,నర్సింగ్,హోటల్ మేనేజ్మెంట్,మెకానికల్ మొదలగు రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చి శిక్ష అనంతరం ఉద్యోగాలు కల్పిస్తున్నాము,శిక్షణ సమయంలో ఉచిత హాస్టల్ మరియు భోజన వసతి కూడా కలదు ఉచిత స్టడీ మెటీరియల్స్ మరియు యూనిఫామ్,షూస్,బ్యాగ్స్ కూడా అందిస్తున్నాము,కాబట్టి నిరుద్యోగ యువతీ,యువకులందరూ దమ్మపేటలోని వాసవి క్లబ్ భవన నందు ఈనెల 18న ఉదయం 9 గంటలకు జరిగేటటువంటి ఈ ఉద్యోగం మేళకు తమ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరై నిరుద్యోగ యువకులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని,ప్రతమ్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ వెంకట్రావు మరియు మేము సైతం ఫౌండేషన్ నిర్వాహకులు తంబల్ల రవి ఒక ప్రకటనలలో తెలిపారు.
పూర్తి సమాచారం కోసం9542823871
9177641543 నెంబర్ కి సంప్రదించగలరు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >