Posted on 2025-12-15 12:39:07
41 గ్రామాల్లో సీపీఐ(ఎం) విజయం
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:మలిదశ పోరులోనూ సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులు విజయాలను అందుకున్నారు. ఆయా మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలను భారీగా కైవసం చేసుకున్నారు. పోటీచేసిన కొద్ది స్థానాల్లోనూ సీపీఐ(ఎం) పార్టీ సత్తాచాటింది. రాష్ట్రవ్యాప్తంగా 41 గ్రామాలు కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 చోట్ల పార్టీ బలపరచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లో 20 సర్పంచ్ స్థానాల్లో పోటీచేసి 14 చోట్ల ఎర్రజెండాను ఎగురవేశారు. ఖమ్మం జిల్లాలో 14, కొత్తగూడెం జిల్లాలో ఆరు, సూర్యాపేటలో ఎనిమిది, యాదాద్రి భువనగిరిలో ఐదు, నల్లగొండ జిల్లాలో నాలుగు చోట్ల విజయం సాధించారు. నారాయణపేట జిల్లాలో నాలుగు, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాలో ఒక్కోక్క గ్రామ పంచాయతీని సీపీఐ(ఎం) కైవసం చేసుకుంది. పలుచోట్ల ఉప సర్పంచ్ పదవులు లభించాయి. వందకుపైగా వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.సూర్యాపేట జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 8 గ్రామ పంచాయతీలను సీపీఐ(ఎం) గెలుచుకున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. మునగాల మండల పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల్లో పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. కలకోవలో-మండవ వెంకటాద్రి, జగన్నాథపురం-బొల్లం యమునా, కొక్కిరేణి-దాసరిశీను, నర్సింహులగూడెం-కుంచం ఇందిరా, నారాయణగూడెం- కాంపాటి వెంకటేశ్వర్లు, చిలుకూరు మండలం కొండాపురంలో బాబు గెలుపొందారు. భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం చీమలకొండూర్ గ్రామసర్పంచ్‌గా పల్లెర్ల అంజయ్య, అనాజిపూర్ సర్పంచ్‌గా సురేశ్ విజయం సాధించారు. రామన్నపే మండలం మునిపంపులలో బొడ్డుపల్లి వెంకటేశ్, దుబ్బాకలో నర్సింహ, వలిగొండ మండలం సుంకిశాలలో సంధ్యారాణి గెలుపొందారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గంలో నలుగురు సీపీఐ(ఎం) అభ్యర్థులు గెలుపొందారు. మిర్యాలగూడ మండలం కుంటకిందితండాలో రూపావతురాజు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. భాగ్య గోపసముద్రంలో మూడవత్ సరస్వతి రవినాయక్, గూడూరు గ్రామంలో బొగ్గారపు కృష్ణయ్య గెలుపొందారు. బోటినాయక్ తండాలో శ్రీనునాయక్, రాయిపాలెంలో కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి ఉపసర్పంచ్‌లుగా విజయం సాధించారు. దామరచర్ల మండలంలో గాంధీనగర్‌లో పోలగాని ఎల్లమ్మవెంకటయ్య గెలుపొందారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >