| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిజ్జరం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విద్యాసాగర్ ఘన విజయం

బిజ్జరం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విద్యాసాగర్ ఘన విజయం

డైలీ భారత్ న్యూస్, బిజ్జరం:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన బోమనపాడ్ విద్యాసాగర్ బిజ్జరం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. కోడంగల్ నియోజకవర్గంలోని కోస్డీ మండలానికి చెందిన బిజ్జరం గ్రామంలో గురువారం జరిగిన ఎన్నికల్లో విద్యాసాగర్ 210 ఓట్ల మెజారిటీతో విజయం నమోదు చేశారు.

గ్రామంలోని 900 మంది ఓటర్లలో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించారు. విద్యాసాగర్‌కు 421 ఓట్లు లభించగా, ప్రతిపక్ష అభ్యర్థి గుండు మల్లా రవికి 211 ఓట్లు వచ్చాయి.

విజయంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. తనను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని, కాంగ్రెస్ ప్రజాపాలనలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తానని నూతన సర్పంచ్ విద్యాసాగర్ తెలిపారు. ఈ విజయం కోడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధిపత్యాన్ని మరోసారి స్పష్టంచేసిందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు .

Previous భీమారం సర్పంచ్‌గా ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా విజయం
Next భక్తులకు TTD అరుదైన అవకాశం - ఒక్క క్లిక్ తో నేరుగా ఇక ఇంటి వద్దకే..!నూతన కాలెండర్స్,డైరీ లు!
ADVERTISEMENT