Posted on 2025-12-10 19:56:14
నూతనకల్ పోలీస్ స్టేషన్ నందు...
లింగంపల్లి గ్రామంలో ఉప్పుల మల్లయ్య హత్య కేసులో 08 మంది నింధుతుల అరెస్ట్
నూతనకల్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశం నంధు నింధితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి.
డైలీ భారత్ న్యూస్, సూర్యాపేట:నిన్నటిరోజు అనగా 09వ తేదీన నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధి లింగంపల్లి గ్రామంలో జరిగిన ఉప్పుల మల్లయ్య హత్యకు సంభందించి 08 మంధిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. నిన్నటిరోజు 09వ తేదీన నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో రాత్రి సుమారు 11.00 గంటల సమయంలో లింగంపల్లి గ్రామంలోని వర్గ విభేదాలు వల్ల ఘర్షణ జరిగి మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి, సూర్యాపేట ఆసుపత్రికి అటునుండి వనస్థలిపురం లో హాస్పటల్ కు చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్ తెలిపినారు. దీనిపై కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నిందితులు ఏ1 ఉప్పుల సతీష్ ఏ2 కొరివి గంగయ్య ఏ3 వీరబోయిన సతీష్ ఏ4 ఉప్పుల గంగయ్య ఏ5 ఉప్పుల ఎలమంచి, ఏ6 వీరబోయిన లింగయ్య, ఏ7 కారింగుల రవీందర్, మరియు ఏ8 దేశపంగు అవిలయ్య లను గుర్తించి అరెస్టు చేశమని అదనపు ఎస్పి తెలిపినారు. గొడవలు మనసులో పెట్టుకొని ఇరు వర్గాలు గొడవపడి పరస్పరం కర్రలు మరియు రాళ్ళతో కొట్టుకోగా ఉప్పుల మల్లయ్య తలకు తీవ్రమైయన రక్తగాయం అయినది. వెంటనే సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వనస్తలిపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరిశీలించి చనిపోయినాడు అని తెలిపినారు. ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 8 మందిని అరెస్టు చేయడం జరిగినది. నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటాం, ఇట్టి కేసు ఛేదించి, సమర్దవంతంగా పని చేసిన సూర్యాపేట డిఎస్పీ ప్రసన్నకుమార్, తుంగతుర్తి సర్కిల్ సిఐ ఎ. నరసింహ రావు, నూతనకల్ ఎస్ఐ ఆర్. నాగరాజు మరియు నూతనకల్ పోలీసు స్టేషన్ సిబ్బందిని అభినంధించారు.
నిందితుల నుండి స్వాదీనము చేసుకున్న వాటి వివరములు :
- రెండు కర్రలు, ఒక మంచం అడ్డ పట్టే కర్ర
- మూడు రాళ్ళు.
- 4 సెల్ ఫోనులు
అరెస్ట్ చేయబడిన నింధితుల వివరములు :
A-1. ఉప్పుల సతీష్ A-2. కొరివి గంగయ్య A-3. వీరబోయిన సతీష్ A-4. ఉప్పుల గంగయ్య A-5. ఉప్పుల ఎలమంచి, A-6. వీరబోయిన లింగయ్య, A-7. కారింగుల రవీందర్, మరియు A-8. దేశపంగు అవిలయ్య.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >