Posted on 2025-12-06 16:16:40
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ దేశంలో అంటరానితం,కుల వివక్ష నిర్మూలన కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి అని ఆయన అన్నారు.
దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారన్నారు. విద్య, న్యాయం, సామాజిక అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాడారన్నారు. అంబేడ్కర్ ప్రజలకు స్వేచ,స్వాతంత్రపు హక్కులు కల్పించారని, కానీ దానిని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తుందన్నారు. ప్రజలకు ఆయన ఇచ్చిన హక్కులను కాలరస్తుందన్నారు. అంబేడ్కర్ పేరును కనుమరుగు చేసే విధంగా బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుతూ సంవిధాన బచావో కారక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని,రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నూడ చైర్మన్ కేశ వేణు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,సీనియర్ నాయకులు భక్తవత్సలం,సీనియర్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, ఏఐసిసి అసెంబ్లీ కో ఆర్డినేటర్ కాపుకర్ గన్ రాజ్,నగర మహిళా అధ్యక్షురాలు రేవతి,సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోల ఉష,చంద్రకళ, విజయ రాణి,దత్తాద్రి,బంటు బలరాం,రాజేంద్ర ప్రసాద్, ఆమ రాజు, అయ్యుబ్,భాజన్న, మహేందర్,ఎండల కిషన్, నరేందర్ గౌడ్, కరాటే రమేష్, అఫ్సర్, చికోటీ దిలీప్, శిలమంతుల రాజు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >