| Daily భారత్
Logo




అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

News

Posted on 2025-12-06 15:47:25

Share: Share


అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: అవినీతి, నిర్లక్ష్యం ఇదే కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన అని అని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. బీజేపీ జిల్లా కార్యాలయం లో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనపై మండిపడి, ప్రజలకు నిజాలు తెలియచేస్తాం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి… కానీ నామమాత్రంగా కూడా అభివృద్ధి కనిపించడం లేదు. మోసాలు, అవినీతి, నిర్లక్ష్యం మాత్రమే పెరిగాయి" అని ఆరోపించారు.

జిల్లాలో అభివృద్ధి శూన్యం అన్నారు బోధన్ షుగర్ ఫ్యాక్టరీకు ఎటువంటి పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.సారంగాపూర్ ఫ్యాక్టరీ పూర్తిగా పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.తెలంగాణ యూనివర్సిటీకి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు.

ఇది అభివృద్ధి కాదు… జిల్లావారిని మోసం చేసే పాలన" అన్నారు.

విమానాశ్రయం విషయంలో కాంగ్రెస్ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు మన నిజామాబాదుకు ఎయిర్‌పోర్ట్ విషయం మాట్లాడకుండా ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ ఇస్తే వెళ్లి సీఎం‌కు సన్మానం చేసిన జిల్లా కాంగ్రెస్ నేతలు సిగ్గు పడాలి" అని ఆయన ధ్వజమెత్తారు.

"జిల్లా ప్రయోజనాలు పక్కనబెట్టి, అధికారపక్షం మురికి రాజకీయాలకు నమస్కారం చేసే వాళ్లను ప్రజలు చూడటం లేదు" అన్నారు.గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే

ఇప్పటి గ్రామాల్లో కనిపిస్తున్న లైటింగ్ నుంచి రోడ్‌ల వరకు… ప్రతి చిన్న అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులతోనే జరుగుతోంది. గ్రామీణాభివృద్ధి అంటే కేంద్రం—రాష్ట్రం వాటా దాదాపు కనబడడం లేదు" అని అన్నారు.

గ్రామాల బడ్జెట్, స్మార్ట్ స్ట్రీట్‌లైట్స్, పి.ఎం గ్రామ సడక్ యోజన, జల జీవన్ మిషన్—ఈ ప్రతిదీ కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తున్నది" రేషన్ బియ్యం కేంద్రం ఇస్తుంది అన్నారు. అని ఆయన వివరించారు

నిజాయితీగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి

ధర్మానికి కట్టుబడి, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థులను మీరు గెలిపించాలి. ఆ వ్యక్తులే మీ గ్రామానికి అభివృద్ధి తెస్తారు. పార్టీ కంటే ప్రజల సేవ ముఖ్యమని భావించే నాయకుల్ని ముందుకు తేవాలి" అన్నారు.

జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన నాయకులు అవినీతిలో మాత్రం ముందున్నారు. నియోజకవర్గ అభివృద్ధి మీద శ్రద్ధ ఏమాత్రం లేదుగాని, అక్రమాల మీద మాత్రం 24 గంటలూ వ్యూహాలు వేసుకుంటున్నారు" అని ఆయన విమర్శించారు. గత 2 సంవత్సరాల పాలనా లో ఇందూరు జిల్లాకు అన్యాయం జరిగింది అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ,దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజి,కార్పొరేటర్లు ప్రమోద్, మాస్టర్ శంకర్,జిల్లా కార్యదర్శి జ్యోతి,మండల అధ్యక్షులు తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్, గడ్డం రాజు, బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ గుప్తా,పంచారెడ్డి శ్రీధర్, బూరుగుల వినోద్, యాదల నరేష్, అమందు విజయ్ కృష్ణ,తెరల శ్రీధర్, భూపతి, హరీష్,ఆనంద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >