Posted on 2025-12-05 18:04:05
ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించాలి
వారి చదువుకు అన్ని విధాలా చర్యలు
ఇటుక బట్టీల యజమానులు సహకరించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
డైలీ భారత్ న్యూస్, కరీంనగర్: జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, కార్మికుల పిల్లలను గుర్తించి వారిని ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల విద్యాధికారులు, ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా వలస కూలీలు ఎక్కువగా పనిచేసే చోటే వర్క్ సైట్ స్కూళ్లు ప్రారంభిస్తారని తెలిపారు. కానీ పిల్లలకు పాఠశాల వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో వారి కుటుంబాలకు సమీపంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక తరగతిలో బోధిస్తున్నామని అన్నారు.
ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి ఈ బడిలో చేర్పించాలని ఆదేశించారు. వారికి పోషకాహారం, దుస్తులు, పుస్తకాలు అందిస్తామని తెలిపారు. ఇటుక బట్టీల యజమానులు వారి సాయంగా పిల్లలకి రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
గత ఏడాది సుమారు 500 మంది వలస కూలీల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించి విద్య అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది మరింత శ్రద్ధతో ప్రత్యేక పాఠశాలలపై దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రత్యేక పాఠశాలల్లో చేరిన వలస కార్మికుల పిల్లలకి ఇంగ్లీషులో బోధించాలని సూచించారు. భవిష్యత్తులో వారికి చదువు పట్ల శ్రద్ధ పెరిగి ఎక్కడికి వెళ్ళినా చదువుకునే ఉత్సాహం ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. బడి బయట ఉన్న పిల్లలను కూడా గుర్తించి బడిలో చేర్పించాలని అన్నారు. ఇప్పటికే 185 మంది పిల్లలను గుర్తించినట్లు విద్యాధికారులు తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులపై దృష్టి పెట్టాలి
పదవ తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నూరు శాతం ఫలితాలు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మండల విద్యాధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశం మందిరంలో మండల విద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పదవ తరగతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాస్ లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.
మండల విద్యాధికారులు వారానికి రెండు సార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోని పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల నమోదు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వాటిని విధిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. స్నేహిత ఫిర్యాదుల పెట్టెలను ప్రతి పాఠశాలలో తప్పక నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >