డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామస్థులు మాజీ సర్పంచ్ రూప పట్ల అసాధారణ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైన రూప చేసిన మంచి పనులకు ముగ్ధులైన సుద్దపల్లి గ్రామస్థులు మరోసారి ఆమెనే సర్పంచ్ గా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా ఆమె సర్పంచ్ గా ఉండాలనే ఆకాంక్షతో గ్రామస్థులు రూ.1.02 లక్షల చందాలు పోగుచేశారు. అంతేకాకుండా ఆమె చే గ్రామంలో ర్యాలీగా తరలివచ్చి ఆమె చే నామినేషన్ దాఖలు వేయించారు.
News
సర్పంచ్ అభ్యర్థి కోసం లక్ష రూపాయలు చందా.. సుద్దపల్లి గ్రామస్థుల వినూత్న ఆలోచన