| Daily భారత్
Logo




డిసెంబర్ 8 నుండి ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్

News

Posted on 2025-11-22 14:14:34

Share: Share


డిసెంబర్ 8 నుండి ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన పనులను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం వేల్కుంట తాండలో డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ జరగనున్న ప్రాంతాన్ని శనివారం కలెక్టర్ పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను, హెలిప్యాడ్ పనులను ఆయన పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ కె.వి. రాజు, ఎంఆర్ఓ గోపాల్, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >