| Daily భారత్
Logo




మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన వరంగల్ పోలీస్ కమిషనర్

News

Posted on 2025-11-22 12:19:42

Share: Share


మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన వరంగల్ పోలీస్ కమిషనర్

డైలీ భారత్ న్యూస్, వరంగల్:నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ రెండవ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...

ప్రస్తుతం అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అత్యాధునిక పరికరాల తో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాని వరంగల్ కమిషనరేట్ పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి రక్తమరకలు, వేలిముద్రలతో ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాధమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని. ఈ మొబైల్ వాహనం లో విధులు నిర్వహించేందుకు ఆరుగురు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందజేయడం జరిగిందని సీపీ తెలియజేసారు.

ఈ కార్యక్రమం డిసిపి అంకిత్ కుమార్,గుణ శేఖర్, అదనపు డిసిపిలు రవి, ప్రభాకర్, శ్రీనివాస్ తో పాటు ఏసీపీ లు, ఆర్. ఐ లు, ఫింగర్ ప్రింట్ ఇన్స్ స్పెక్టర్లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >