| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏకగ్రీవంగా కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ కమిటీ ఎన్నిక

ఏకగ్రీవంగా కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ కమిటీ ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, హన్మకొండ: హన్మకొండ అలంకార్ జంక్షన్ దగ్గర లో ఉన్న కాకతీయ కాలనీ లోనీ కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అందులో అధ్యక్షునిగా దేవులపల్లి కోటేశ్వర్ ఎన్నుకోన్నారు .ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ కుబేర హోమ్స్ వెల్ఫేర్ సొసైటీ కమిటీని అన్ని విధాల ముందుకు నడిపిస్తానని అపార్ట్మెంట్ లో ఉన్న సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా నరసింహస్వామి, కార్యదర్శిగా మేదరాజు,జాయింట్ కార్యదర్శిగా మహేందర్, అడ్వైజరి కమిటీ సభ్యులుగా ఎస్ బిక్షపతి, ప్రసన్నకుమార్, గురు ప్రసాద్, వెంకటనారాయణ, లింగమూర్తి, ఓం ప్రకాష్, బాబు గౌడ్, కార్యవర్గ సభ్యులుగా మేఘరాజ్ ,చంద్రశేఖర్, రవీందర్, వెంకటరమణ, దయానంద్, రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యులుగా ఇందిరా గౌతమి శ్రీలత కమిటీ సభ్యులను అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.

Previous పార్టీ బలపడేది కేవలం కార్యకర్తల అంకితబావం తోనే
Next మాస శివరాత్రి సందర్భంగా కోటగుళ్లలో సత్యనారాయణ వ్రతాలు
ADVERTISEMENT