| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాస శివరాత్రి సందర్భంగా కోటగుళ్లలో సత్యనారాయణ వ్రతాలు

మాస శివరాత్రి సందర్భంగా కోటగుళ్లలో సత్యనారాయణ వ్రతాలు

డైలీ భారత్ న్యూస్, భూపాలపల్లి:భూపాలపల్లి జిల్లాలో గణపురం మండలం కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో కార్తీకమాస ఉత్సవాలలో భాగంగా మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ వ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి   సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వేద పండితులు శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు శ్రీమాన్ గోవర్ధన వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు బూరుగుపల్లి మఠం గంగాధర్, జూలపల్లి నాగరాజు కొలనుపాక భద్రం లకు పట్టు వస్త్రాలను బహుకరించి శాలువాలు పూలమాలలతో  ఘనంగా సన్మానించారు.

వేదపండితులకు పట్టు వస్త్రాల సమర్పణ,సన్మానం.

Previous ఏకగ్రీవంగా కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ కమిటీ ఎన్నిక
Next ఏసీబీకి చిక్కిన టిజిఎస్‌పిడిసిఎల్ సహాయక ఇంజనీర్
ADVERTISEMENT