Posted on 2025-10-18 13:27:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అన్ని వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా అని ప్రముఖ దంత వైద్య నిపుణులు సీనియర్ వైద్యులు డాక్టర్ నందకుమార్ మరియు వైద్యులు, వక్తలు పేర్కొన్నారు.. హిమోఫిలియా బారిన పడ్డామని ఎలాంటి ఆందోళన చెందకుండా మనో ధైర్యంగా ముందుకు సాగినప్పుడే ఎంతటి వ్యాధినైనా అధిగమించి జీవితంలో రాణించవచ్చని సూచించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో హిమోఫిలియా చాప్టర్ VIII డిస్ట్రిబ్యూషన్ మరియు ఫ్యాక్టర్ ఎస్సే టెస్ట్ మరియు సెల్ఫ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ కాన్సన్ట్రేట్స్ శిబిరానికి హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ మరియు ఇంటాస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ కే నందకుమార్ మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ మనోజ్ సాయి, డాక్టర్ ఇందు గైనకాలజిస్ట్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, హిమోఫిలియా నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షులు విజయానందరావు, సూర్య హెల్త్ ఆర్గనైజేషన్, చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేంద్ర కుమార్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిమోఫిలియా అనేది డయాబెటిస్ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా ఒక వ్యాధి అన్నారు.. ఈ వ్యాధి పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. హిమోఫిలియా అనేది ఒక రాజవంశపు వ్యాధిగా గుర్తించడం జరిగిందన్నారు.. అయితే ఈ వ్యాధి పుట్టుకతో రావడం మరియు వంశపార్యంపరంగా రావచ్చు లేదా వంశంలో లేనప్పటికీ రూపాంతరం చెందడం వల్ల కూడా రావచ్చు.. ఈ వ్యాధి బారిన పడ్డామని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.. చాలావరకు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్ బిపి మరియు క్యాన్సర్ అలాంటి వ్యాధుల బారిన పడ్డప్పటికీ వాటిని అధిగమించడం అతి కష్టం కానీ హిమోఫిలియాను తట్టుకొని ఆధిగమించడం కేవలం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుందని సూచించారు.. హిమోఫిలియా సొసైటీ అధ్యక్షులు విజయానందరావు ప్రస్తుతం 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని ఏళ్ళ క్రితం హిమోఫిలియా భారిన పడ్డప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగి హిమోఫిలియా వ్యాధిగ్రస్తులు భయాందోళన చెందకుండా వారిలో మనోస్థైర్యం నింపే దిశగా కృషి చేయడం సంతోషకరమన్నారు.. అలాగే దివ్యాంగుల ఉన్నతి కోసం స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి కార్యదర్శి సిద్దయ్య లు స్నేహ సొసైటీని స్వచ్ఛందంగా నెలకొల్పి కొన్నేళ్లుగా ఎంతోమంది దివ్యాంగుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. వారి బాగోగులతోపాటు ప్రభుత్వం నుండి వారికి రావలసిన హక్కుల కోసం ఎంతో కృషి చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు.. మరీ ముఖ్యంగా హిమోఫిలియా వ్యాధి వల్ల పిల్లలు పెద్దలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా పాలన యంత్రాంగం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేయడం వారి సేవా తాత్పర్యానికి నిదర్శనం అన్నారు.. హిమోఫిలియా వ్యాధి బారిన పడ్డప్పటికీ పిల్లలు పెద్దలు ఎక్కువగా ఆటలు ఆడడం దెబ్బలు తగిలించుకోవడం వల్ల మాత్రమే ఎక్కువ ఇబ్బంది ఎదురుకోవాల్సి వస్తుందని తెలిపారు.. దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కీళ్లు కండరాళ్లు దెబ్బతినకుండా ఉండడంతో పాటు అంగవైకల్యం బారిన పడకుండా ఉంటారని తెలిపారు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1500 మంది హిమోఫిలియా వ్యక్తులు ఉండవచ్చని అధికారుల అంచనా అయినప్పటికీ ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నవారు హిమోఫిలియా సొసైటీలో వారి పేర్లు నమోదు చేసుకోకపోవడం బాధాకరమన్నారు.. ఎందుకంటే స్నేహ సొసైటీ, ఇంటాస్ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అందరికీ చేరే విధంగా కృషి చేస్తున్న నమోదు చేసుకొని వారికి అందకపోవడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. హిమోపిలియా వ్యాధిగ్రస్తులకు సైతం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంతో పాటు పెన్షన్ ఇతరత్రా వసతులు మరియు పరికరాలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.. అనంతరం హిమోఫిలియా చాప్టర్ 8 కు సంబంధించిన కిట్లను అందజేశారు.. ఈ కార్యక్రమంలో హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షులు దాసరి విజయ ఆనందరావు, ఇంటస్ ఫౌండేషన్ రిప్రెసెంటేటివ్ కరుణాకర్, ఎజాజ్, గంగారం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >