| Daily భారత్
Logo




ఖానాపూర్ కేజీబీవీను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

News

Posted on 2025-10-17 20:53:57

Share: Share


ఖానాపూర్ కేజీబీవీను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

డైలీ భారత్ న్యూస్,వరంగల్/ ఖనాపూర్ :వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం  ఆకస్మిక తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భోజన నాణ్యతను పరిశీలించి, కూరల రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనును ఖచ్చితంగా పాటించాలన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు.

కేజీబీవీ లో విద్యార్థుల సౌకర్యార్థం  ఏర్పాటు చేసిన  తలుపులు,  ఇనుప గ్రిల్స్, టాయిలెట్ల మనమ్మత్తులను, ఆరో ప్లాంట్, కిచెన్  రూఫ్  తదితర  పూర్తయిన పనులను కలెక్టర్ పరిశీలించారు.   కోతులు వస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కోతులు రాకుండా వెంటనే  మెష్  ఏర్పాటు చేయాలని డీఈ ను ఆదేశించారు.

వారంలో ఒకరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్  డేగా నిర్ణయించి ఆరోజు పిల్లలతో అదే భాష రోజు మొత్తం మాట్లాడించాలని, దీనితో వారి  వకాబులరీ పెరుగుతుందన్నారు .  విద్యార్థులతో ముచ్చటించి వారి పట్టణ సామర్థ్యాన్ని తెలుసుకొని ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన  కంప్లైంట్ బాక్స్ లో వేయాలన్నారు.

క్రీడల కొరకు వాలీబాల్ బాస్కెట్బాల్, ఖో ఖో కోర్టులు కావాలని విద్యార్థులు కలెక్టర్ ను కోరగా, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

 తహసిల్దార్ రమేష్, టిఈడబ్ల్యూఐడిసి డిఈ అశోక్, జి ఈ సి ఓ ఫ్లోరెన్స్, ఎంఈ ఓ శ్రీదేవి స్పెషల్ ఆఫీసర్  మేనక,  ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

Posted On 2026-04-10 18:20:34

Readmore >
Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 17:14:44

Readmore >