Posted on 2025-10-17 20:27:01
సుధీర్ రమ్నాథ్ కేకన్, ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారి, మహబూబాబాద్
డైలీ భారత్ న్యూస్,మహబూబాబాద్:దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, OTPలు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారు అని అన్నారు.
అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగింది.నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసగాళ్లు ఆకర్షించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాక మోసగాళ్లు
వాట్సాప్, SMS, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.
యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడంలాంటివి చేస్తారు.
గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు పొందపరచి మోసం చేస్తారు.ప్రజలకు సూచనలు చేస్తూ
ధృవీకరించిన వెబ్‌సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేయండి అని తెలిపారు.
టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు.ఎవరికీ బ్యాంక్ వివరాలు, OTP, యూపీఐ పిన్‌లు పంచుకోవద్దు.
ముందుగానే చెల్లింపులు చేయకుండా, “Cash on Delivery (CoD)” సదుపాయాన్ని వినియోగించండి.ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >