Posted on 2024-01-05 14:08:42
డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణలో ప్రజాప్రతి నిధుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార, అంగ బలాన్ని అడ్డుపెట్టు కుని తమ భూములు లాక్కున్నారని బాధితులు గోడును చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జాచేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకు నేందుకు మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన 600 మంది బాధితులు తరలి వచ్చారు.
శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో తమ భూములను మల్లా రెడ్డి కబ్జా చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రజాభవన్ ముందు శుక్రవారం ఆదోళనకు దిగారు.
మల్లారెడ్డిపై చర్యలు తీసు కుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇవాళ్టి ప్రజావాణి కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులు సైతం ఆందోళనకు దిగారు.
ప్రేమ్ సాగర్ రావు తమ నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మొదలు పెట్టిన ప్రజావాణి కార్యక్రమా నికి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తుండగా ఇందులో భూవివాదాలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >