Posted on 2025-10-16 20:09:17
ముఠాలో ఇద్దరు అరెస్టు..12 వాహనాలు స్వాధీనం
పరారీలో ముఠా సభ్యుల కీలక సూత్రదారి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ జిల్లాలో వాహనాలు దొంగతనాలు చేసి ఫేక్ నంబర్ ప్లేట్లతో జగిత్యాల్ జిల్లాలో అమ్మకాలు చేసే ముఠాలో ఇద్దరు సభ్యులను సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక సూత్రదారులైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇటీవల జగిత్యాల జిల్లాలో ఒక ఆటోకు స్థానిక పోలీసులు ఫైన్ వేశారు. అయితే ఫైన్ మాత్రం కామారెడ్డి జిల్లా వాసికి వచ్చింది. సదరు ఆటో యజమాని తాను ఎన్నడు జగిత్యాల్ జిల్లాలో తిరిగింది లేదు, తాను ఎలా ఫైన్ కట్టేదని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య సీసీఎస్ టీం ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ కత్రోజు నాగేంద్రచారి, సిఐలు సాయినాథ్, సురేష్, ఎస్సై గోవింద్, సిబ్బంది ఆధ్వర్యంలో కేసును చేదించినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. గురువారం నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సాయిచైతన్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీసీఎస్ టీం ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఆటోనగర్ కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఫాజిల్, ఆటో నగర్ కు చెందిన ఎలక్ట్రిషియన్ గా పని చేసే మహ్మద్ నవాజ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేక్ ఆలీ, ఆలీంలతో పాటు పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్న ఆటోనగర్ కు చెందిన మహ్మద్ వాహిద్ పాషాలతో కలిసి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, ముథోల్ జిల్లాలో ఆటోలో, బైక్ లు దొంగతనాలకు పాల్పడినట్లు షేక్ ఫాజిల్, మహ్మద్ నవాజ్ లు సీసీఎస్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో వాటిని అమ్మిన జగిత్యాల్ జిల్లాలో, కోరుట్లలో 9 ఆటోలో, మూడు మోటార్ సైకిళ్ళను రికవరి చేశారు. ఇందులో ఫాజిల్,నవాజ్ లను అరెస్టు చేయగా షేక్ ఆలీ, ఆలీం,మహ్మద్ వాహిద్ లు పరారీలో ఉన్నారని తెలిపారు. సంబంధిత ఆటోలో, బైక్ లను కొనుగోలు చేసిన జగిత్యాల్ జిల్లా కోరుట్ల మండలం బెండపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్ ల ద్వారా వాహనాలను రికవరి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4 ఆటోలో,3 మోటార్ సైకిళ్ళ అడ్రస్ లు లభించాయని వాటిని ఆయా పోలీస్ స్టేషన్ లకు అప్పగిస్తామని సీసీఎస్ ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా దొంగతనాలు చేసిన వాహనాలను ఫేక్ నంబర్లతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మూఠాను పట్టుకోవడంలో సీసీఎస్ టీం పని తీరును నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి, సిఐలు సాయినాథ్, సురేష్, ఎస్సై నారాయణ, కానిస్టేబుళ్ళు ఉన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >