Posted on 2024-01-04 10:33:51
డైలీ భారత్, హైదరాబాద్: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.
ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డాటా ఎంట్రీలపై కలెక్టర్లతో ఈరోజు టెలీకాన్ఫ రెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామసభ లను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహి స్తుండడంపై కలెక్టర్లను సీఎస్ అభినందించారు.
6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు.మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్‌మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్‌వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిం చాలని తెలిపారు.
ఈ డాటా ఎంట్రీ చేపట్టేం దుకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రస్థాయిలో ట్రెయినీ ఆఫ్ ట్రైనర్ (TOT )లకు 4న శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ టీఓటీలకు జిల్లా స్థాయి లో డాటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయా లని, ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమిం చుకోవాలని ఆదేశించారు. నిన్నటి వరకు దాదాపు 57లక్షల దరఖాస్తులు అందాయని, ప్రతీ నాలుగునెలలకోసారి ప్రజాపాలన నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు.
దరఖాస్తులు ఇవ్వని వారు తిరిగి దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయితీ రాజ్ కమిషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >