Posted on 2025-09-26 20:53:18
డైలీ భారత్ న్యూస్, వరంగల్/నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన అంగోత్ వీరన్న నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించినందుకు గాను నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు అంగోత్ ఫుల్ సింగ్ నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలోత్ చరణ్ సింగ్, సీనియర్ నాయకులు మలోత్ నముకు నాయక్, జరుపుల రమేష్ నాయక్, రేలకుంట గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.
డాక్టరేట్ సాధన ద్వారా మండలానికి గౌరవం చేకూరిందని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలో నిమగ్నం అవ్వాలని అభినందనలు తెలియజేశారు. అంగోత్ వీరన్న నాయక్ శ్రమ, అంకితభావం అన్ని కార్యకలాపాలకు ప్రేరణగా ఉంటుందని గుర్తుచేశారు.
ఈ ఘన సన్మానం ద్వారా నల్లబెల్లి మండల ప్రజల కోసం విజ్ఞాన, సామాజిక సేవలో మార్గదర్శకత్వం కొనసాగేలా ఉందని నేతలు తెలిపారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >