| Daily భారత్
Logo




రోడ్డు రోలర్ బోల్తా పడి ఇద్దరు మృతి

News

Posted on 2023-12-30 14:31:43

Share: Share


రోడ్డు రోలర్ బోల్తా పడి ఇద్దరు మృతి

డైలీ భారత్,  విశాఖపట్నం:  విశాఖ పట్నం లోని గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన బత్తుల నరసింహా రావు అనే వ్యక్తి రోడ్డు రోలర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తాటి చెట్ల పాలేనికి చెందిన రమణమ్మ అనే మహిళ కూలిగా పని చేస్తుంది.

గత మూడు రోజులగా జాలరి పేటతో పాటు భీమిలి వైపు వెళ్లే బీచ్ రోడ్‌లో పనులు చేస్తున్నా రు.ఈ క్రమంలో శనివారం ఉదయం  జోడుగుల్లపాలెం నుంచి సాగర్ నగర్ వైపు బీచ్ రోడ్‌లో వెళ్తుండ గా..జూ పార్కు గేటు దగ్గరకు వచ్చేసరికి, రోడ్డు భారీగా ఎత్తు పల్లంగా ఉంది.

దీంతో రోడ్డు రోలర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. బ్రేకులు కూడా సరిగా పడకపోవడంతో.. కంగారుపడిన డ్రైవర్ నర్సింగ్ రావు వెంటనే రోలర్‌పై తనతో ఉన్న మహిళను దూకేయాలని సూచించాడు.

దీంతో భయంతో ఒక్కసారి గా దూకేసిన ఆమె రోలర్‌ కింద పడడంతో కాళ్లు నలిగిపోయాయి. మరోవైపు రోడ్డు రోలర్‌ను అదుపు చేసేందుకు డ్రైవర్ నర్సింగ్ రావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డివైడర్ పైకెక్కి అవతలి రోడ్డు వైపు వెళ్లి అదుపుతప్పి బోల్తాపడింది.

దీంతో నర్సింగ రావుపై రోడ్‌ రోలర్‌ ఎక్కడంతో అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయా డు. వెంటనే రగంలోకి దిగిన ట్రాఫిక్‌  డీసీపీ శ్రీనివాస రావు, సీఐ ప్రసాద్‌ రావు గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆమె కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అనంతంర అధికారులు క్రేన్ సాయంతో బోల్తా పడిన రోలర్‌ను పైకి లేపి అక్కడ నుంచి తరలిం చారు. జూ పార్కుకు అతి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు.

ఒకవేళ జూ గేటు ఎదురుగా ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత మరింత పెరిగేదని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు..

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >