Posted on 2025-09-24 21:57:27
ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు
డైలీ భారత్, ఈ బయ్యారం: ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుల ఆస్తుల జప్తు చేయబడతాయని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన ఈ బయ్యారం పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో
2024 జూన్ 29న నమోదైన Cr.No.78/2024, U/s 8(c) r/w 20(b)(ii)(C), 27A, 29 of NDPS Act-1985 కేసులో ముద్దాయిల , వారి బంధువుల యొక్క ఆస్తులను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వారి పేరు మీద ఉన్న ఒక ట్రాక్టర్,ఒక కారు,ఒక ఆటో,4 మోటార్ సైకిల్, 03 గృహాలను చెన్నై కాంపిటేటివ్ అథారిటీ ద్వారా ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకోవడం జరిగిందన్నారు.వీటి విలువ మొత్తం సుమారు 23,52,116/- కలదని, కోర్టు వారి ఉత్తర్వులతో ఇట్టి కేసులో ముద్దాయిలయిన నలుగురికి సంబంధించిన ఆస్తులను మరియు వారి బంధువుల ఆస్తులను జప్తు చేయడం జరిగిందని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
ప్రభుత్వ నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేసి సంపాదించిన ముద్దాయిల ఆస్తులను మరియు అట్టి డబ్బుతో వారి బంధువుల పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగిందని వెల్లడించారు.ఆస్తులు జప్తు చేయబడిన ముద్దాయిలు
1.జాటోత్ విజయ్ S/o.దర్యాప్ సింగ్(లేట్ ), వయసు 28 సంవత్సరాలు, కులం: లంబాడ వృతి: కారు డ్రైవర్, R/o అమర్ సింగ్ తండా, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా.
2. జాటోత్ భాస్కర్ S/o బాలు, వయసు 28 సంవత్సరాలు, కులం: లంబాడ వృతి: ఆటో డ్రైవర్, R/o అమర్ సింగ్ తండా, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా.
3. జాటోత్ సురేష్ @ కన్నా ,S/o. వీరయ్య ,అమర్ సింగ్ తండా, తొర్రూర్ మండల్, మహబూబాబాద్ జిల్లా.
4. నునావత్ గణేష్ ,S/o. శీను, దుబ్బ తండా , తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా.
గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపించడమే కాక వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా కృషి చేసిన ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >