| Daily భారత్
Logo




కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..

News

Posted on 2025-09-24 12:51:34

Share: Share


కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..

బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ డివిజన్ ఒకటి ఖానాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు  శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు  మంజూరు పత్రాలను అందజేశారు.బుధవారం రోజు ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్మణ్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో  మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని, మహిళల కోసం  ఇందిరమ్మఇండ్లు, ఉచితం బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సోలార్ ప్లాంట్ లు,డ్వాక్రా  గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలను  ఇస్తున్నామని, ఇందిరాస్ మహిళా శక్తి ద్వారా రుణాలు ఇచ్చి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని అన్నారు. అలాగే సోలార్ ప్లాంట్ లను పెట్టుకుని విద్యుత్ ను ప్రభుత్వానికి  అద్దెకు ఇవ్వాలని, ప్రభుత్వమే   మహిళలకు డబ్బులు చెల్లిస్తుందని అన్నారు.బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో   ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, 200 యూనిట్ల  ఉచిత విద్యుత్, వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా అని ప్రజలు బిజెపి వారిని  ఒకసారి ప్రశ్నించాలని అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ కట్టిన కాలేశ్వరం మూడు సంవత్సరాలకే కూలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్ని  ఇప్పటివరకు ఎటువంటి  సమస్య లేకుండా ఉన్నాయని అన్నారు. కెసిఆర్ కుటుంబంలో  ఆస్తి గొడవలు జరుగుతున్నాయని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని  నమ్మద్దని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఖానాపూర్ గ్రామానికి 12 కోట్ల నిధులను కేటాయించి, రోడ్లు, అంగన్వాడి భవన్, మహిళా భవన్, వంటివి కట్టించామని అన్నారు. ప్రస్తుతం ఖానాపూర్ కాలూర్ గ్రామాలకు కలిపి 86 ఇందిరమ్మ ఇల్లు  మంజూరు చేశామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో   ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, ఖానాపూర్ డివిజన్ అధ్యక్షులు కోర్వ్  రాజేందర్, మాజీ కార్పొరేటర్ కోర్వ గంగాధర్, ఎ ఏం సి డైరెక్టర్లు బాగా రెడ్డి, రాజలింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య, సీనియర్ నాయకులు బాగా రెడ్డి, అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >