Posted on 2025-09-20 13:56:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ లోగల డి.ఎస్.ఎన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే, ట్రస్ట్ చైర్మన్ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు దేవి నవరాత్రుల సందర్బంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవ కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించిన సందర్బంగా ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందని అన్నారు. హిందూ ధర్మరక్షణకు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి కార్యానికి తన ట్రస్ట్ ద్వారా సేవాలాందించడానికి ముందుంటమన్నారు,అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ధన్ పాల్ లక్ష్మీబాయి & విఠల్ గుప్త ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >