Posted on 2025-09-19 16:51:44
మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలల తీర్చిదిద్దుతా..
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి తెరల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చాయ్ అమ్ముకునే స్థాయి నుండి దేశప్రధానిగా ఎదిగి భారతదేశన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మోదీగారిని భావి తరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆడబిడ్డ పుట్టిననాటి నుండి విద్య, వైద్యం, పెళ్లి చేసుకునే వరకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి విద్య, ఉపాధిలో అవకాశాలు కల్పించడం చరిత్రత్మక నిర్ణయం అన్నారు. అగ్రవర్ణ పేద కుటుంబాలు అన్ని బిజెపి ప్రభుత్వానికి రుణపడి ఉన్నారని తెలిపారు. మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తాని అన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతుల ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. వినయం, విధేయత, విద్యకు మారుపేరుగా ప్రఖ్యాతలు కలిగిన మాణిక్ భవన్ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం 800 నోట్ పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణి చేశారు.
కార్యక్రమంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్, మాణిక్ భవన్ పాఠశాల అధ్యక్షులు ఇంగు శివ ప్రసాద్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల ప్రభాకర్, క్యాషియర్ గాలి నాగరాజు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు మాణిక్ భవన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >