| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మిస్ అయిన మహిళ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య

మిస్ అయిన మహిళ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య

డైలీ భారత్, భువనగిరి: మూడు వారాల క్రితం అదృష్యమైన ఓ వివాహిత చెట్టుకు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆదివారం యాదాద్రి భువ నగిరి జిల్లాలోచోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా పరిధిలో భూక్య శారద అనే వివాహిత మూడు వారాల క్రితం అదృశ్యమైంది.

అయితే మృతురాలు గ్రామం పక్కన ఓ మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

అయితే మూడు వారాల క్రితం ఈ మహిళ అదృశ్య మైనట్లుగా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీ సులు మిస్సింగ్ కేసు కింద కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Previous కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
Next అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్
ADVERTISEMENT