| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లో కోణార్క్ హాస్పిటల్(సిరిసిల్ల) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కమాండెంట్ యస్. శ్రీనివాస రావు

17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లో కోణార్క్ హాస్పిటల్(సిరిసిల్ల) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కమాండెంట్ యస్. శ్రీనివాస రావు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కోణార్క్ హాస్పిటల్ కి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ సింహారెడ్డి(MBBS,MD,DNB) వారి టీమ్ తో కలిసి పోలీస్ బెటాలియన్ సిబ్బందికి నరాల బలహీనత, వెన్నెముక మరియు మెదడు యెక్క  రుగ్మతల గురించి అవగాహన కల్పించారు. వివిధ రకాల టెస్టులు నిర్వహించారు. వ్యాధికి గల కారణాలు - నివారణలను వివరించారు. సిబ్బందికి గల అనుమానాలు నివృత్తి చేసి తగు సలహాలు సూచనలు చేశారు. 

ఈ  సందర్బంగా బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ "హెల్త్ ఈజ్ వెల్త్ " అని  పోలీస్ సిబ్బంది యొక్క విధులు మిగతా వారితో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటాయని, ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉండటం వల్ల హెల్త్ గురుంచి కేర్ తీసుకునే టైమ్ ఉండదు కానీ ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వ్యాయామం, యోగ లాంటివి చేయాలనీ అన్నారు.సిబ్బంది అందరూ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కోణార్క్ హాస్పిటల్  వైద్య బృందానికి కమాండెంట్ యస్. శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ.జె.పి నారాయణ, యమ్.పార్థసారథి రెడ్డి, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Previous అజ్ఞాతంలోకి వెళ్లిన బిగ్‌బాస్‌ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌
Next ఫోర్జరీ సంతకంతో 26 లక్షలు లూటీ
ADVERTISEMENT