డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను జిల్లా మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారు మంగళవారం తంగళ్ళపల్లి వద్ద అక్రమంగా టిప్పర్ ద్వారా మట్టిని తరలిస్తున్నట్లు మైనింగ్ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే స్పందించిన సహాయ సంచాలకులు సైదులు సంబంధిత టిప్పర్ ను సీజ్ చేయాల్సిందిగా రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులును ఆదేశించారు. దీంతో రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులు టిప్పర్ ను సీజ్ చేసి సిరిసిల్ల బస్ డిపో కు తరలించారు.జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ AD సైదులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
News
టిప్పర్ సీజ్ చేసిన మైనింగ్ అధికారులు : అక్రమంగా మట్టి తరలిస్తున్నందుకు చర్యలు