| Daily భారత్
Logo




మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

News

Posted on 2023-12-19 05:50:07

Share: Share


మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

డైలీ భారత్, ములుగు:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు.

జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ అధి కంగా ఉంటుంది,

దీంతో కొందరు భక్తులు రెండు నెలల ముందుగానే మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.ఈ సంఖ్య కూడా లక్షల్లోనే ఉండడం గమనార్హం.

మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నప్పటికీ… ఇప్పటికే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను చేస్తోంది. జాతర ముందు రోజుల నుంచి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపనుంది. అయితే ఇప్పటికే మేడా రానికి తరలివస్తున్న భక్తుల కోసం బస్సులను నడుపు తున్నట్లు వరంగల్‌ ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత ఇప్పటికే ప్రకటించారు.

భక్తుల సౌకర్యార్ధం ఈనెల 17 నుంచి స్పెషల్‌ బస్సు లను ప్రారంభించారు. ప్రతీ బుధ, ఆదివారం సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్‌ నుంచి ప్రతీ 45 నిమిషాలకు ఒక బస్సును అందుబాటు లో ఉంచారు.

భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు పెంచనున్నారు. ఇదిలా ఉంటే జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేసింది.

ఇందులో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్‌ విభాగానికి రూ.8.28కోట్లు, పోలీస్‌ శాఖకు రూ.10.50 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.2.80 కోట్లు.. ఇలా వివిధ శాఖలకు నిధులు కేటాయించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఈసారి జాతర ఏర్పాట్లు, నిర్వహణలో తమ మార్క్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటు న్నారు

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >