Posted on 2025-07-12 19:57:16
డైలీ భారత్, మహబూబాబాద్: ప్రతీ రోజు వ్యాయామం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తమ సిబ్బందితో ఆచరణలో చూపించారు. శనివారం ఉదయం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్ టి ఆర్ స్టేడియం వరకు, తిరిగి ఎన్ టి ఆర్ స్టేడియం నుండి పోలీస్ స్టేషన్ వరకు సుమారుగా 5 కిలోమీటర్లు రన్నింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ 24/7 ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండే ప్రతి పోలీస్ అధికారికి వ్యాయామం ఎంతగానో ఉపయోగ పడుతుందని, శరీర దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని తద్వారా ఉద్యోగంలో చక్కటి ఫలితాలు సాధించవచ్చునని, ప్రతీ ఒక్కరు వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >