| Daily భారత్
Logo




ప్రతిభావంతులకు పో పా చేయూత

News

Posted on 2025-07-12 14:29:23

Share: Share


ప్రతిభావంతులకు పో పా చేయూత

ఘనంగా ప్రతిభ పురస్కారాల ప్రదానం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు (పోపా)పద్మశాలి ఆఫిషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నిరంతరం చేదోడుగా నిలుస్తుందని పలువురు వక్తలు అన్నారు. పోపా ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం పట్టణంలోని పద్మశాలి కల్యాణభవనంలో శనివారం నిర్వహించారు. అతిథులుగా టెక్స్టైల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చేర్మన్ గూడూరి ప్రవీణ్, ప్రముఖ వైద్యులు గూడూరి రవీందర్, గీతావాణి, ఎంఈవోలు దూస రఘుపతి, కృష్ణహరి, విశ్రాంత ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, మచ్చ అనందం. న్యాయవాది. గెంట్యాల భూమేశ్, మామిడాల భూపతి తదితరులు హాజరై మాట్లాడారు. పద్మశాలి. సామాజిక వర్గంలో ప్రతిభకు కొదవలేదని, పేదరికం పెద్ద చదువులకు ఆటంకం కాకూడదని ఉన్నత చదువులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి వేసవిలో విద్యార్థుల శ్రేయస్సు కోసం పాలీసెట్, స్పోకెన్ ఇంగ్లిష్ ఉచిత శిక్షణలతో పాటు కార్మిక ప్రాంతాల్లో ఆరోగ్య, వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని రాజీ లేని కృషితో జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఎప్పెట్, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. పోపా సేవల్లో ప్రత్యక్ష భాగస్వాములను. ఆర్ధిక విరాళాలు అందించిన దాతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పోపా ప్రతినిధులు దేవత ప్రభాకర్, చేరాల ప్రభాకర్, బైర్ ప్రభాకర్, ఆడెపు వేణు, మోర దామోదర్, అంకారపు జ్ఞానోద, వాసాల హరిప్రసాద్, గడ్డం సత్యనారాయణ, శ్రీపతి భూమేశ్, గుండెల్లి రవి, ద్యావన పెల్లి పరమేశ్వర్, బండారి శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



ప్రతిభా పురస్కారాలు కార్యక్రమంలో మాట్లాడుతున్న డోనరుగా కార్యక్రమానికి ప్రదీప్తి ఫౌండేషన్ తరపున సహకరించిన POPA ఉపాధ్యక్షులు గెంట్యాల భూమేష్ 



POPA ప్రతిభ పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహనకు ఆర్థికంగా సహకరించిన డోనర్స్ డాక్టర్ గూడూరు రవీందర్ మరియు గీత కు కృతజ్ఞతాపూర్వక సన్మానం ..

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >