Posted on 2025-07-09 12:25:22
హోటల్ మేనేజ్మెంట్ చేరిన వారు కెరీర్ పై దృష్టి పెట్టాలి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం విష్ణుమ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ను ప్రముఖ ఫోక్ డాన్సర్ జాహ్నలిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ లు ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాలేజ్ విద్యార్థులతో ఆమె ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు, హోటల్ మేనేజ్మెంట్ పేరు నిలబెట్టాలని ఆమె ఆకాంక్షించారు. వివిధ విద్య చేరుతూ పై స్థాయికి వస్తున్నప్పటికీ కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సును కూడా ఎంచుకొని విజయవంతంగా కోర్సును పూర్తి చేయాలని అలాగే విదేశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ ల తో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ పిల్లలు చేరడానికి ఆసక్తి చూపడం కొత్త ఉరవడికి నాంది అని అన్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్, చైర్మన్ ఈశ్వర్, ఇంచార్జ్ సిహెచ్ శ్రీకాంత్ లకు హోటల్ మేనేజ్మెంట్ అనుభవం ఉందని అన్నారు ఇందులో చదివిన వారికి నూటికి నూరు శాతం ఉద్యోగాలతో పాటు ప్లేస్మెంట్స్ ఇంటర్సిప్స్ వసతులు కల్పించడంతోపాటు, యూరప్, అబ్రాడ్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తమకు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు.
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >