Posted on 2025-07-08 14:27:14
ఆమె ఆరు పదులు దాటిన వృద్ధురాలు..
తనకంటూ ఎవరూ లేని స్థితిలో.. గుండె సంబంధిత సమస్యతో బతికీడుస్తున్న దైన్య స్థితి..
వృద్ధాప్య దశలో ఉన్నవారిని ఐన వారే కాదనుకునే నేటి ఆధునిక కర్కశ సమాజం..
చిన్నప్పుడు ఓనమాలు దిద్దించిన గురువుపట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు జర్నలిస్టు కిరణ్ కుమార్ గండికోట..
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంనగర్ నివాసి మొతడాకా రమాదేవి (65) ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ గా పనిచేశారు. తన భర్తను కోల్పోయారు.. పిల్లలు కూడా లేరు.. తనకంటూ ఎవరూ లేని పరిస్థితుల్లో .. వృద్దాప్య దశలో ఓ వైపు ఒంటరితనం వేధిస్తూ ఉంటే మరోవైపు గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
తల్లి తండ్రి తర్వాత స్థానంలో తనకు ఓనమాలు దిద్దించిన గురువు రమాదేవి ఆరోగ్య విషమ పరిస్థితి గురించి తెలుసుకుని చలించి పోయిన కిరణ్ కుమార్.. ఆమెను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పాడు.
స్థానిక హృదయ క్లినిక్ గుండె స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు ఆమెను తీసుకువెళ్ళి, డాక్టర్ కు పరిస్థితిని వివరించారు.
డాక్టర్ అరుణ్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి.. గుండెకు సంబంధించిన అన్ని టెస్టులు చేశారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, వెంటనే గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయవలసి ఉంటుందని తెలిపారు.
డాక్టర్ రాసిచ్చిన మందులను నెల రోజులకు సరిపడా కిరణ్ అందజేశాడు.
తనవంతు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్ చేయిస్తానని తన టీచర్ కు భరోసా ఇచ్చారు.
చిన్నతనంలో ఓనమాలు దిద్దించిన గురువు పట్ల కిరణ్ కుమార్ చూపిస్తున్న గౌరవం ,ప్రేమ ఆదరాభిమానాలను చూసి డాక్టర్ అరుణ్ కుమార్ సైతం చలించి పోయారు. ఆమె గుండె శస్త్ర చికిత్స కు సంబంధించి ప్రముఖ కార్డియాలజిస్టులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
ఒక జర్నలిస్టుగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో లేకపోయినా కిరణ్ కుమార్ ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం చేయడాన్ని తన ప్రవృత్తిగా చేసుకున్నాడు..
చిన్నతనంలో ఎప్పుడో తనకు ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయురాలు పట్ల కిరణ్ కుమార్ గండికోట చూపిన ఔదార్యం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >