Posted on 2025-07-06 12:57:38
- మధ్యంమత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై నెలరోజులగా స్పెషల్ డ్రైవ్.
- గడిచిన నెలరోజుల్లో 1509 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, రూ.5 లక్షల 41 వేల జరిమానా.
- 15 మంది మద్యంబాబులకు జైలు శిక్ష అమలు.
డైలీ భారత్, సూర్యాపేట: గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ జిల్లా కేంద్రం సహా అన్ని పోలీసు స్టేషన్ ల పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ ద్వారా 1509 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగినది జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందులో 15 మందికి జైలు శిక్షల పడగా మొత్తం కేసుల్లో రూ.5 లక్షల 41 వేలు కోర్టుల నందు జరిమానా కట్టించడం జరిగినది. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారిపై సూర్యాపేట డివిజన్ పరిధిలో 957 కేసులు, కోదాడ డివిజన్ పరిధిలో 552 కేసులు నమోదు చేయబడ్డాయి. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, నేరం అందుకు జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు అని ఎస్పి గారు హెచ్చరించారు. వానదారులు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా కాని, పరోక్షంగా కాని రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నరు, మధ్యంతాగి వాహనం నడిపినవారు సైతం మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అన్నారు. ఇది దృష్టిలో ఉంచి జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగినది. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు పటిష్టంగా నిర్వహిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట పర్చడం ద్వారా వాహనదారులకు కోర్టులో జైలు శిక్షలు, జరిమానా విధించడం జరుగుతుందని. ఎస్పీ సూచనలు చేస్తూ కుటుంబాలను దృష్టిలో వుంచుకొని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దని, తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు, అంగవైకల్యంగా జీవితాలను కొనసాగిస్తూన్నారని, ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనదారులు తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పి తెలిపినారు తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >